మహిళలకు బంపర్ ఆఫర్: ఉచిత బస్సు ప్రయాణం – పూర్తి వివరాలు! | RTC Free Bus Required Documents 2025
Highlights
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇది నిజంగానే శుభవార్త! ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గారు ఇటీవల ఈ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక వివరాలను వెల్లడించారు. ఇకపై మహిళలు ఎలాంటి టికెట్ లేకుండానే బస్సుల్లో ప్రయాణించవచ్చు.
ప్రభుత్వ ID కార్డు ఉంటే చాలు
ఈ ఫ్రీ బస్ స్కీం మహిళలందరికీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఆయన స్పష్టతనిచ్చారు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ID కార్డు ఉంటే చాలు. ఆధార్ కార్డ్, ఓటర్ ID, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని పొందవచ్చు. ఇది మహిళల సాధికారతకు ఒక ముందడుగు అని చెప్పడంలో సందేహం లేదు.

5 రకాల బస్సుల్లో బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా
RTC ఎండీ ద్వారకా తిరుమలరావు గారు మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల మహిళలకు, విద్యార్థినులకు, ఉద్యోగినులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ RTC ఫ్రీ బస్ పథకంపై ప్రజల్లో భారీ అంచనాలున్నాయి.
Tags: ఉచిత బస్సు, మహిళలు, RTC, ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్, ఉచిత ప్రయాణం, ఆగస్టు 15, బస్ స్కీం, బస్సులు, ఐడీ కార్డులు